జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అందాల తార, ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది. తాజాగా ఆమె చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు, ఇంతకీ దసరా రోజు ఆమె ఓ మంచి పని చేసింది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ దసరా సందర్భంగా పర్సనల్ మేకప్మెన్కు కారుని బహుమతిగా ఇచ్చింది… ఈ సమయంలో కారు కీస్ అతని చేతికి ఇస్తూ దగ్గరుండి పూజలు కూడా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు.
లాక్డౌన్ సమయంలో సల్మాన్ ఫాం హౌజ్లోనే ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ లలో పాల్గొంటుంది. ఆమె చాలా ప్రముఖ సెలబ్రెటీ అనే విషయం తెలిసిందే ..ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది . శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. హౌస్ ఫుల్ 2- రేస్ 2 హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్ ఈ సినిమాల్లో నటించింది ఈ శ్రీలంక బ్యూటీ.