మన మధ్య బాలుగారు లేరు అనే మాట అస్సలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం, కరోనా రక్కసి బాలు గారిని మన నుంచి తీసుకువెళ్లిపోయింది, అయితే ఆయనకు వైద్యం చేసిన వైద్యులు కూడా ఆయన గురించి అనేక విషయాలు తెలియచేస్తున్నారు.
చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో బాలుకు వైద్యం చేసిన డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు వెల్లడించారు, బాలు గారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఓ రోజు చరణ్ వచ్చి ఆయనకు వచ్చిన మెసేజులు అన్నీ చూపిస్తున్నారు.
అయితే ఇళయరాజాగారు పంపిన సందేశాన్ని ఫోన్ లో చూసిన బాలుగారు … చరణ్ ను ఇటువైపు రమ్మని సైగ చేశారు. చరణ్ ఆయనకు దగ్గరగా వెళ్లగా, నువ్వు కాదు ఫోన్ అంటూ సైగ చేసి, ఫోన్ అందుకుని ఇళయరాజా సందేశాన్ని ముద్దాడారు. ఆయన అంటే అంత అభిమానం, ఇద్దరి మధ్య అంత బంధం ఉంది, ఇది చూసి మాకే ఆశ్చర్యం కలిగింది, పిల్లలకు భార్యని చూడగానే ఆయన చాలా ఆనందించేవారు, చనిపోయే రెండు రోజుల ముందు ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తిచెందింది. ఆ ఇన్ఫెక్షన్ కు ఏ మందూ పనిచేయలేదు. మెదడులోనూ రక్తస్రావం జరిగింది ఇలా బాలు గారు మన నుంచి దూరం అయ్యారు అని ఆయన తెలిపారు.