బంపర్ ఆఫర్ కొట్టేసిన పెళ్ళిసందడి బ్యూటీ..ఏకంగా ఆ హీరోతోనే సినిమా

0
110

పెళ్లి సందడి సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమైన శ్రీ లీలా ఈ సినిమా ద్వారా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ సినిమాలో నటించిన అనంతరం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపొయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడిలో అనుకున్న మేరకు కలెక్షన్స్ సాదించలేకపోయిన సినీ ఇండస్ట్రీలో బ్యూటీ వుమెన్ గా పేరు సంపాదించుకుంది.

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న F3 సినిమా మే 27వ తేదీన విడుదలకు ముందే బాలకృష్ణ తో కలిసి మరో సినిమా చేయాలనీ అనిల్ రావిపూడి కమిట్ అయ్యారు. 50 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధుడి గెటప్ లో బాలక్రిష్ణ మనకు చూపించడానికి రెడీ  అయ్యాడు అనిల్ రావిపూడి.

ముఖ్యంగా తండ్రి – కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులకు చూపించే విధంగా ఈ కథ ఉండబోతుందని తెలిపారు. అయితే బాలకృష్ణకు కూతురి పాత్రలో శ్రీ లీలా ను తీసుకోబోతున్నట్లు అనిల్ రావిపూడి వెల్లడించారు. దాంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకుంటుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.