మరికొద్దిసేపట్లో కేకే మృతికి గల అసలు కారణాలు వెల్లడి..

0
97

తాజాగా ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ అకస్మాత్తుగా మరణించి అందరిని ఆశ్యర్యానికి చేయడంతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం రాత్రి కృష్ణకుమార్‌ కున్నత్‌ కోల్‌కతాలో అద్భుతంగా సంగీత ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అబ్బురపరిచారు. సంగీత ప్రదర్శన అనంతరం హోటల్‌కు చేరుకున్న కేకే అక్కడిక్కడే కుప్పకూలి  గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా ఇందులో వాస్తవమెంతొ మనకు ఇంకా తెలియలేదు.

అయితే ప్రస్తుతం ఈ మరణానికి గల కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కేకే ఆసుపత్రికి తరలించే సమయంలో తల, ముఖంపై గాయం గుర్తులున్నట్లు గమనించినట్టు  సమాచారం. గాయం ఎలా అయ్యిందనే అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఆయన పార్థీవ దేహానికి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్న క్రమంలో మృతి గల కారణాలు స్పష్టంగా తెలియనున్నాయి. మనము కేకే మృతికి గల అసలు కారణాలు తెలవాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.