లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శ్రుతి హాసన్. తొలి ప్రయత్నంగా ‘ లక్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రుతికి పెద్దగా లక్ కలిసి రాలేదు. ఇక ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఓ మై ఫ్రెండ్, బలుపు ,ఎవడు, గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్. పవన్ కల్యాణ్ తో చేసిన ‘కాటమరాయుడు’ మూవీ తర్వాత తెలుగు సినిమాలు తగ్గించేసింది.
ఇక దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజ్ సరసన ‘క్రాక్’ సినిమాలో నటించింది శ్రుతి. దీంతో పాటు పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్ ‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే కొంతకాలంగా అందాల ఆరబోతకు దూరంగా ఉన్న ధ్యాస మళ్లి తన గ్లామర్ రోల్ చేయడానికి ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.