బిగ్బాస్ నాల్గో సీజన్లో జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మంచి హైప్ తీసుకువచ్చాడు, అతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత సరదాగా సాగింది, అయితే హౌస్ లో ఉన్నన్ని వారాలు చాలా నవ్వించాడు, అయితే జబర్ధస్త్ ని వీడి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అవినాష్.. మొత్తానికి పది లక్షలు చెల్లించి బయటకు వచ్చాడు.
అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను లాభపడ్డాడు అనే తెలుస్తోంది అతని ఇంటర్వ్యూల ద్వారా, అయితే బుల్లితెరలో పలు షోలు కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు అవినాష్. ఇక బిగ్ బాస్ ఫినాలే రోజు హౌస్ లోకి దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు.
సరదాగా అందరిని నవ్వించారు ఆయన,,ఇక తాజాగా ఆయన గురించి ఓ విషయం చెప్పాడు అవినాష్.. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు.
ఒకసారి కలవమని కూడా చెప్పినట్లు అవినాష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అవినాష్ కి ఇటు సినిమాల్లో కూడా వెంటనే ఛాన్స్ వచ్చింది దీంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.