దక్షిణాది చిత్ర సీమలో సాయిపల్లవికి ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది.. మంచి డ్యాన్సర్ గా హీరోయిన్ గా అగ్రకథానాయికగా ఆమె కొనసాగుతోంది, తెలుగు తమిళ మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది, అయితే ఎక్స్ పోజింగ్ పాత్రలకు ఆమె దూరం. అంతేకాదు కథ నచ్చాలి ఆ పాత్ర ఆమెకి నచ్చాలి లేకపోతే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా చేయదు.
అందుకే అభిమానులు కూడా సాయి పల్లవిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక నటన విషయంలో ఆమె అద్బుతం అనే చెప్పాలి, అయితే తాజాగా ఆమె కొన్ని కీలక విషయాలు చెప్పింది, అందులో ఓ సినిమాలో రొమాంటిక్ సీన్లో నటించే సమయంలో ఆ సినిమా హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు చెప్పాడని ఆమె తెలిపింది.
ఈ సమయంలో ఆమె వెంటనే తాను ఇలాంటి సీన్లో నటించను అని తెలిపిందట, నాకు ఇలాంటి సీన్లు చేయడం కంఫర్ట్ కాదు అని తెలిపిందట, ఇక ఆ దర్శకుడు కూడా ఏమీ అనలేదట, తర్వాత ఆ సినిమా ఏమిటి దర్శకుడు ఎవరు అనేది ఆమె బయటపెట్టలేదు..మీ టూ కారణంగా లిప్లాక్ సీన్ నుండి తప్పించుకున్నా అని తెలిపింది.