MeToo ఉద్యమం ఎంత తారాస్ధాయికి వెళ్లిందో తెలిసిందే… ఇక కాస్టింగ్ కౌచ్ అంశం గురించి రోజూ ఎక్కడో ఓ చోట మనం వింటూనే ఉంటున్నాం, ఎవరో ఓ నటి తమకు ఎదురైన ఇబ్బందులు గురించి తెలియచేస్తూనే ఉన్నారు..
తాజాగా బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్పై నటి, సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా లైంగిక ఆరోపణలు చేశారు. అతను చేసిన నీచమైన పనిపై విషయం బయటపెట్టారు.
2005లో సాజిద్ వద్ద తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ట్వీట్ల రూపంలో ఈ విషయం తెలిపారు ఆమె..
నా తండ్రి చనిపోయిన కొన్ని రోజుల తరవాత 2005 ఏప్రిల్లో నేను సాజిద్ను కలిశాను. ఈ సమయంలో అతను చాలా చెత్తగా బిహేవ్ చేశాడు.
అతని ప్యాంట్లో నుంచి మర్మాంగాన్ని బయటికి తీసి చూపించాడు. దాన్ని ఫీల్ అవ్వమని నన్ను అడిగాడు. నాకు ఇంకా గుర్తు ఉంది నేను అతనికి నో చెప్పాను, నా మీటింగ్ అతని పురుషాంగాన్ని ఫీలవడానికి, దానికి రేటింగ్ ఇవ్వడానికి కాదు అని కూడా చెప్పాను అని తెలిపింది, దీంతో అతనిపై బాలీవుడ్ లో అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని ఆమె తెలిపింది.