సినిమా థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులను అనుమతించేలా తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిని చాలా మంది వైద్యులు మేధావులు వ్యతిరేకిస్తున్నారు.. ఎందుకు అంటే దాదాపు 9 నెలలుగా వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు కాస్త కేసులు తగ్గుముఖం పట్టాయి మళ్లీ థియేటర్లకు ఇంత భారీగా జనం వస్తే పరిస్దితి చేయిదాటే ప్రమాదం ఉంటుంది అంటున్నారు చాలా మంది..
ముఖ్యంగా ఓ వైద్యుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ లో చెప్పారు…డాక్టర్ అరవింద్ శ్రీనివాస్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… పోలీసులు వైద్య అధికారులు పారిశుద్య కార్మికులు అలసిపోయారు, మేం హీరోలం కాదు
మేం ఊపిరి పీల్చుకోవడానికి కొంత టైమ్ కావాలి. ఈ ఉపద్రవం ఇంతటితో పూర్తి అయిపోలేదు.
థియేటర్లకు 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడం అంటే ఇది ఆత్మహత్యాయత్నమే , దీనిపైమరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని తెలిపారు, దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలపండి.