ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా రానుంది, అయితే ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని రోజులుగా కొందరి పేర్లు వినిపించాయి…చాలా సస్పెన్స్ గా ఎవరు ఉంటారా అని ఆలోచన చేశారు.. ఫైనల్ గా ఆ పేరు అయితే బయటకు రివీల్ చేసింది చిత్ర యూనిట్.
అనుష్కా? పూజ హెగ్డేనా? అసలు ఎవరు చేస్తారు అని అందరూ అనుకున్నారు, ఫైనల్ గా శాకుంతలంలో టైటిల్ రోల్ ను అందాలతార సమంత పోషిస్తోంది. గుణ టీమ్ వర్క్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సమంత అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.
ముఖ్యంగా న్యూ ఇయర్ రోజున కొత్త అప్ డేట్ రావడంతోసామ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు..
కాళిదాసు విరచిత శాకుంతలం కావ్యాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు, మరి ఈ పాత్ర ఎవరు చేస్తారు అని అందరూ ఆలోచన ఛేశారు….చాలా మంది అందాల తారల పేర్లు వినిపించినా ఫైనల్ గా సమంత ని ఒకే చేశారు..పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు.