‘ది గ్రే మ్యాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్..ఫుల్ హ్యాపీ లో ధనుష్ ఫాన్స్

0
110

కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో తన నటనతో ఎంతో మంది అభిమానుల గుండెల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈయన నటించిన అన్ని సినిమాలు దాదాపు మంచి హిట్స్ అందుకున్నవే. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళం, ఇతర భాషల్లో కూడా తన నైపుణ్యాన్ని గనపరుస్తున్నాడు.

తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరెకెక్కించబోతున్నారు. ఈ సినిమా  తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రస్తుతం జో రూసో దర్శకత్వంలో రాబోయే హాలీవుడ్ పిక్చర్ ‘‘ది గ్రే మ్యాన్’’ మూవీలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ పిక్చర్ లోని ధనుష్ ఫస్ట్ లుక్ ను రివీల్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు.

అందులో ధనుష్ మాస్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో ఉన్నాడు. ఓ కారుపైన నిలబడి ఉన్న ధనుష్ లుక్ డిఫరెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ పిక్చర్ ఈ ఏడాది జూలై 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీడీలో విడుదల చేయనున్నట్లు ధనుష్ తెలిపారు.