పెళ్లి పీటలెక్కబోతున్న ఆ హీరో-హీరోయిన్..!

The hero-heroine who is going to get married..Iconic Palace stage

0
90

బాలీవుడ్​ లవ్​బర్డ్స్ రణ్​బీర్ కపూర్-ఆలియా భట్ ఈ ఏడాదిని శుభవార్తతో వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వీరు డిసెంబరులో డెస్టినేషన్​ వెడ్డింగ్​ చేసుకోనున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్​లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి వివాహ వేడుకకు రాజస్థాన్​లోని ఓ ఐకానిక్​ పాల్యెస్​ వేదిక కానున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం రణ్​బీర్​-ఆలియా కలిసి ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్​ షూటింగ్​ను త్వరగా ముగించి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారట. మిగతా ప్రాజెక్ట్​ల షూటింగ్​ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలిసింది.​ త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశముంది.

త్వరలోనే ఆలియా ‘ఆర్​ఆర్​ఆర్’, ‘గంగూబాయ్​ కతియావాడి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే డార్లింగ్స్​, రాకీ ఔర్​ రానీ కీ ప్రేమ్​ కహానిలో నటిస్తోంది. కాగా, రణ్​బీర్​.. ‘షంషేరా’ సహా మరో చిత్రంలో నటిస్తున్నాడు.