ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీలో ఆ హీరోయిన్ ఫైనల్..

0
114

దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించి విశేషప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరెకెక్కిన ఈ సినిమా అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ ల మోత మోగిస్తుంది.

ఈ సినిమాతో సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఓ మంచి పేరు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 31వ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునేను తీసుకునేునే ఆలోచనలో టీమ్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హిందీ సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.