Breaking news – వివాదంలో హీరోయిన్ సాయి పల్లవి

0
274
Sai Pallavi

టాలీవుడ్ లోని హీరోయిన్ల‌లో సాయిప‌ల్ల‌వికి ప్ర‌త్యేక‌ క్రేజ్ ఉంది. ప్రేమ‌మ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. తాజాగా సాయిప‌ల్ల‌వి ‘విరాట‌ప‌ర్వం’ అనే సినిమాలో హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే సాయిపల్లవి సరికొత్త వివాదంలో చిక్కుకుంది. కశ్మీర్ పండిట్ల ఊచకోతపై ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వారిపై జరిగింది మతపరమైన హింసే అయితే గోరక్షణ పేరుతో జరుగుతుంది కూడా అలాంటిదే అంటూ చేసిన వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హీరోయిన్ సాయి పల్లవి పై భజరంగ్ దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.