కూకట్ పల్లి కోర్టులో హీరోయిన్ సమంతకు ఊరట

The heroine Samantha was arraigned in the Kookat Palli court

0
129
samantha fan

కూకట్ పల్లి కోర్టులో నటి సమంతకు ఊరట కలిగింది. పరువు నష్టం దావా కేసులో నేడు కోర్టు విచారణ జరిపింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవరు ప్రసారం చేయడానికి వీల్లేదన్న కూకట్ పల్లి కోర్టు. సమంత కూడా వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని సూచించింది.. రెండు యూట్యూబ్ ఛానెల్స్, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింక్స్ ను తొలగించాలి. సమంత కేసులో ప్రతివాదులు ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయకూడదు. సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ ను తొలగించాలి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ బంధానికి ముగింపు పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాద్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి సామాజిక మాధ్యమాల్లో నటి సమంతను టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు చేశారు. అలాగే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్​పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.