డార్లింగ్ ప్రభాస్ గురించి అతడి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో రొమాన్స్, ఫైట్, ఎమోషన్..ఇలా దేనినైనా సరే బాగా చేస్తాడు. కానీ అదంతా ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే. బయటమాత్రం చాలా తక్కువ మాట్లాడుతాడని, కాస్త సిగ్గరి అని..ఇప్పటివరకు మనం ఎక్కడో ఓ చోట విన్నాం. కానీ అదంతా తెలియనివాళ్లు చెప్పే మాటలని హీరోయిన్ కృతిసనన్ చెప్పింది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం ప్రభాస్ సిగ్గరి. కొత్త వారిని కలిసినప్పుడు కొంచెం బిడియంగానే ఉంటారు. కానీ అతడితో కొంత సమయం గడిపితే మాత్రం..ప్రభాస్ ఎంత ఎక్కువ మాట్లాడుతాడో తెలుస్తుంది. అతడి పనిచేస్తే చాలా బాగుంటుందని కృతిసనన్ చెప్పింది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.