సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట వచ్చేసింది..!

The last song written by Sirivennela Sitaramashastri has arrived ..!

0
78

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. . నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కొద్దిసేపటి క్రితమే సిరివెన్నెల రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ పాట వింటుంటే మళ్లీ సిరివెన్నెల పాటలు రావు అనేభావోద్వేగం ఉబుకుతుంది. ఇక  శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది.

‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్ ప్రోమోను ఇది వరకే విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక పూర్తి సాంగ్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

https://www.youtube.com/watch?v=-19EvIcr9ZA&feature=emb_title