నిఖిల్ కార్తికేయ 2 చిత్రానికి సరికొత్త టైటిల్ – టాలీవుడ్ టాక్

The latest title for Nikhil Karthikeyan 2 movie

0
78

ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. 18 పేజేస్ చిత్రం అలాగే కార్తికేయ 2. ఇక ఈరెండు చిత్రాల్లో 18 పేజెస్ సినిమాను పూర్తి చేశారు నిఖిల్. ఇక ఇప్పుడు ఫోకస్ అంతా కార్తికేయ 2 పైనే ఉంది. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకి కార్తికేయ 2 అనే టైటిల్ కాకుండా వేరే టైటిల్ పరిశీలనలో ఉందట.

దైవం మనుష్య రూపేణా అనేది టైటిల్ గా పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు. ఇక ఈ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో రానుంది.
సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో ముడిపడిన కథతో మొదటిభాగం వచ్చింది. ఇక రెండో కథ మరింత సరికొత్తగా తీసుకువస్తున్నారు.

ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యంతో ముడిపడి, రెండవభాగం కథ ఉంటుంది అని టాలీవుడ్ లో సినిమా జనం మాట్లాడుకుంటున్నారు. గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లోని లొకేషన్స్ లో కీలక షూటింగ్ పూర్తి చేశారు. ఇక తర్వాత యూరప్ దేశాలలో తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.