తల్లి కాబోతున్న హీరోయిన్..

0
268

టాలీవుడ్ లో తక్కువ సినిమాలు తీసినకూడా ప్రేక్షకుల గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోయిన వారిలో నమిత కూడా ఒకరు. తన ఎడతెగని అందాలతో అందరిని కట్టిపడేయడంతో పాటు. చాలామంది ప్రేక్షకులను తన సొంతం చేసుకుంది. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు అందరితో ఆడిపాడింది ఈ అమ్మడు.

కేవలం తెలుగులోనే కాకుండా త‌మిళంలో కూడా అధిక సినిమాలు నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో బాల‌కృష్ణ‌తో సింహా, ప్ర‌భాస్‌తో బిల్లా వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అనంతరం  వీరేంద్ర అనే వ్యక్తిని పెళ్లిచేసుకొని వైవాహిక జీవితంలోకి అడుపెట్టిన ఈ భామ ఆ తరవాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.

అయితే తాజాగా తన  పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అంటూ బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వార్తపై నెటిజ‌న్స్ ఆమెకు పుట్టిన‌రోజు అభినంద‌న‌లతో పాటు ఆమె త‌ల్లికాబోతున్నందున అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. అయితే 41 సంవత్సరాలలో నమిత ప్రెగ్నెంట్ కావడం వల్ల కొత్త అధ్యయనం మొదలయ్యింది అని పోస్ట్ పెట్టింది.