తెలుగు ఓటీటీ ఆహా’లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేస్తున్న సామ్జామ్ షోకి చాలా మంది ప్రముఖులు సినిమా సెలబ్రెటీలు హీరోలు తారలు వస్తున్నారు, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, పలు విషయాలు పంచుకున్నారు మెగాస్టార్, ఇక పది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలో బిజీ అయ్యారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు, ఆ తర్వాత ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు అనే విషయం తెలిసిందే ..ఇక ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు, మళ్లీ మెగాస్టార్ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు, ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు, అయితే తాజాగా ఆయనకు ఓ జాతీయ పార్టీ కీలక పదవి ఆఫర్ చేసింది అని వార్తలు వినిపించాయి, తాజాగా ఆయన ఈ షోలో క్లారిటీ ఇచ్చేశారు.
పాలిటిక్స్ అసలు తనకు సెట్ అవ్వవని తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక నటుడిగానే ఉంటాను రాజకీయాల జోలికి పోను అని తెలిపారు ఆయన.