ఈ వాలెంటైన్స్‌ డేకి సరిగ్గా సరిపోయే సినిమా వచ్చేసింది..!

0
89

ఈ వాలెంటైన్స్‌డేకి సరిగ్గా సరిపోయే సినిమా వచ్చేసింది. అదేంటంటే ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పుడు వచ్చిన ఆలోచనే ‘సెహరి’ సినిమా అని నటుడు హర్ష్ చెప్పారు. ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితమ్యే చిత్రం కాదు. అలాగే అన్ని వయసుల వారికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు నటుడు హర్ష్.  “టైటిల్‌కు తగ్గట్లుగానే ‘సెహరి’ సినిమా ఒక పండగలా ఉంటుంది.

ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని  పంచుతుందని హర్ష్‌ కనుమిల్లి అన్నారు. ఈ సినీమా తీయాలని ఆలోచన ఎలా వచ్చిందంటే ఒక పెళ్లికి వెళ్లినప్పుడు నా స్నేహితుడు ‘పెళ్లి కూతురు సోదరి అందంగా ఉందని చెప్పాడు. ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన నుంచే నేనీ కథ రాసుకున్నాఅని అన్నారు. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ.. జ్ఞానసాగర్‌ ద్వారక తీసిన చిత్రమే ఈ ‘సెహరి’. అద్వయ జిష్ణురెడ్డి నిర్మించారు. సిమ్రాన్‌ చౌదరి కథానాయిక.ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాఅని అన్నారు. స్వతహాగా నాకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ అంటే ఇష్టం. అందుకే తొలి ప్రయత్నంగా ఈ తరహా కథాంశం ఎంచుకున్నా అన్నారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యముంటుంది. సంగీత దర్శకుడు కోటికి ఈ చిత్రంలో బలమైన పాత్ర లభించింది. ఆయన నటన కొత్తగా ఉంటుంది.

నాయిక సిమ్రాన్‌ నటనలో బెస్ట్‌ ఇచ్చింది. అభినవ్‌ గోమఠం కామెడీ ఫ్లేవర్‌తో ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్‌ అయిపోతారు. ప్రశాంత్‌ ఆర్‌.విహారి పాటలు అలరిస్తాయి. ద్వితీయార్ధంలో సిమ్రాన్‌ తనదైన నటనతో కట్టిపడేస్తుంది. ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.  ఈ చిత్రంలో ఓ బాలీవుడ్‌ ఏగ్రేడ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందీ అన్నారు. అలాగని ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితమ్యే చిత్రం కాదు. అన్ని వయసుల వారికి నచ్చేలా ఉంటుంది. కాబట్టి వాలెంటైన్స్‌డేకి సరైన సినిమా సెహరీనే.