టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు ప్రభాస్… ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది చిత్ర సీమకు చెందిన వారు వివాహం చేసుకున్నారు. మరి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు, ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని ఆత్రుతగా ఉన్నారు, ఇక ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి గురించి మీడియాలో అనేక వార్తలు వినిపించాయి.
ఇక పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అనే వార్తలు వచ్చాయి, అయితే తాజాగా ఇప్పుడు టాలీవు్డ్ లో మరో వార్త వినిపిస్తోంది.. మిర్చి సినిమా నుంచి బాహుబలి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి.. మిర్చి బాహుబలి సాహో సినిమా కూడా పూర్తి అయింది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.
కృష్ణం రాజు సతీమణి సన్నిహితులైన ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని ప్రభాస్ కు జోడీగా చూస్తున్నారట..
ఆ అమ్మాయి బడా బిజినెస్మెన్ కూతురు అని తెలుస్తోంది…అమ్మాయి తండ్రికి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి, మరి తాజాగా టాలీవుడ్ లో ఈ వార్త వినిపిస్తోంది…దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ నమ్మేది లేదు అంటున్నారు అభిమానులు.