ప్రముఖ మలయాళం సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. స్టార్ యాక్ట్రెస్ మంజూ వారియర్ ను ఆయన వేధింపులకు గురి చేయడంతో తీవ్రంగా మండిపడుతూ అనేక సార్లు హెచ్చరించిన కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేసింది.
స్టార్ హీరోయిన్ మంజు వారియర్ సనల్ కుమార్‌పై చేసిన ఆరోపణలు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. మంజు వారియర్‌ను కొన్నేళ్లుగా సోషల్ మీడియా, ఈ మెయిల్, ఫోన్ ద్వారా వేధిస్తున్నందుకు అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం నుంచి సనల్ కుమార్ శశిధరన్ అనేక అవార్డులను పొంది ఇలాంటి పని చేశాడంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు.
అయితే వీరిద్దరూ కయాట్టం సినిమా ద్వారా పరిచమయ్యారు. సనల్ కుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ‘కయాట్టం’ అనే సినిమాలో యాక్ట్రెస్ మంజూ వారియర్ ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఈ సినిమా అనంతరం తర్వాత అసభ్యకర మెసేజ్ లు పంపడం స్టార్ట్ చేశాడని..అదే పనిగా మంజుకు ఫోన్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తుండడంతో భరించలేక పోలీసులకు పిర్యాదు చేసినట్టు తెలిపింది.