నిరుపమ్ పరిటాల రియల్ స్టోరీ

The Real Story of Nirupam Paritala

0
44

తెలుగు బుల్లితెరపై ఇప్పుడు నెంబర్ వన్ సీరియల్ అంటే వెంటనే చెప్పేది కార్తీకదీపం. ఈ సీరియల్ ని లక్షలాది మంది చూస్తున్నారు, సీరియల్ అంటే మహిళలు మాత్రమే చూస్తారు అని అంటారు. కాని ఇక్కడ అబ్బాయిలు ముఖ్యంగా యూత్ కూడా ఈ సీరియల్ ని చూస్తున్నారు. ఇక ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత భార్యలతో భర్తలు కలిసి ఈ వీడియో చూస్తున్న వీడియోలు మనం చూలా చూశాం.

అయితే ఇందులో దీప పాత్ర ఎంత పాపులర్ అయిందో, అలాగే డాక్టర్ బాబు పాత్ర కూడా అంతే పాపులర్ అయింది.
మరి డాక్టర్ బాబు పేరు ఏమిటి అంటే నిరుపమ్ పరిటాల . ఆయన రియల్ స్టోరీ చూద్దాం.ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 1988ఆగస్టు 19న జన్మించారు నిరుపమ్. ఇక సినిమాల్లో సీరియల్స్ లో నటుడిగా రచయితగా పేరు సంపాదించుకున్న ఓంకార్ కుమారుడే నిరుపమ్.

విజయవాడలోనే వీరమాచినేని పద్దయ్య సిద్ధార్ధ స్కూల్లో చదువుకున్నారు. ఆయన సీరియల్ నటి మంజులని 2010లో వివాహం చేసుకున్నారు. అక్షర ఓంకార్ అనే అబ్బాయి వీరికి ఉన్నాడు. నిరుపమ్ ఎక్కువ కాలం చెన్నైలో పెరిగారు. ఇక తండ్రి ఓంకార్ నిరుపమ్ ని హీరోగా చేయాలి అని భావించారు, కాని ఆ కోరిక నెరవేరకుండానే ఆయన మరణించారు.
చంద్రముఖి సీరియల్ ద్వారా హీరోగా మారారు బుల్లితెరలో నిరుపమ్.

ఇక సినిమాల్లో ప్రయత్నించినా ఆయనకు అక్కడ పెద్ద సక్సస్ రాలేదు.మూగమనసులు,కాంచనగంగ,కార్తీకదీపం,కలవారి కోడలు ,అత్తారింటికి దారేది , హిట్లర్ గారి పెళ్ళాం లో నటించారు,నటిస్తున్నారు. ఇక బుల్లితెర టాక్ ప్రకారం ఆయనకు రోజుకి 20 వేల వరకూ రెమ్యునరేషన్ ఇస్తారట. నిరుపమ్ కి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. రమ్యకృష్ణ ఇష్టమైన హీరోయిన్. ఇక దాదాపు ఆయనకు మూడు కోట్ల విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి అంటారు బుల్లితెరలో.