నజ్రియా నజీమ్ మనకు తెలుగులో రాజారాణి సినిమాలో బాగా నటించిన నటిగా తెలుసు… మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం.
నజ్రియా నజీమ్ 1994 డిసెంబరు 20 కేరళలో త్రివేండ్రంలో జన్మించింది. ఆమె సినిమా నటి, నాట్యకారిణి, వ్యాఖ్యాత, మోడల్, ప్లేబ్యాక్ సింగర్. అంతేకాదు తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో ఆమె నటించింది, ముందు నజ్రియా మలయాళం టివి చానెల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించారు.
ఆమె పేరెంట్స్ నజీముద్దీన్, బేగం బీనా. ఆమె సోదరుడు నయీన్ నజీం. వారు దుబాయ్ లో ఉండేవారు, తర్వాత కేరళ చేరుకున్నారు, ఆమె తిరువనంతపురంలోని క్రైస్ట్ నగర్ సీనియర్ సెకండరీ స్కూల్ లోనూ చదువుకున్నారు, ఇక వ్యాపారం చేయడం అంటే ఆమెకి ఇష్టం, అందుకే ఆమె కామర్స్ బిబిఏ చేయాలి అని అనుకున్నారు.
2006లో మలయాళ చిత్రం పలంకుతో బాలనటిగా వెండితెర తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించగా, మమ్ముట్టి కుమార్తె పాత్రలో నటించారు నజ్రియా.2010లో మోహన్ లాల్ చిత్రం ఒరు నాల్ వేరుంలో నటించారు
మలయాళ సినిమా మాడ్ డాడ్ చిత్రంలో హీరోయిన్ గా మారారు నజ్రియా. తమిళంలో రాజా రాణి సినిమాలో నటించారు ఈ సినిమా తెలుగులోకి డబ్బింగ్ చేశారు ..
కీర్తన పాత్రలో ఐటి ఉద్యోగిగా నటించారు నజ్రియా. ఇలా మంచి పేరు గుర్తింపు ఈ సినిమాతో టాలీవుడ్ లో కూడా సంపాదించారు. ఇక ఆమె నటనకు మలయాళ చిత్ర సీమలో ఆమెకి ఎన్నో అవార్డులు వచ్చాయి.మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ ని ఆమె 21 ఆగస్టు 2014న తిరువనంతపురంలో తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు, మంచి పాత్రలు వస్తే చేస్తాను అంటున్నారు సినిమాల్లో.