ఏదైనా అద్బుతమైన ఆర్ట్ చూసిన వెంటనే రాజా రవివర్మ పేరు గుర్తు వస్తుంది, మరి ఇంతకీ ఆయన ఎవరు అనేది చూద్దాం.
రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. ఆయన రామాయణ, మహాభారతములోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందారు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళలు ఆయనకు బాగా తెలుసు, స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో ఈ ప్రపంచంలో ఆయనని మించిన వారు లేరు.
రాజా రవివర్మ కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించాడు. ఆయనని ట్రావెన్ కోర్ మహారాజు చేరదీసీ తన ఆస్ధానంలో ఉంచారు, అక్కడ ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు.
1873 వియన్నా చిత్ర ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చారు.దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించారు రవివర్మ. కాని తర్వాత ఆ ప్రెస్ ని అమ్మేశారు
రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఆయన అప్పటికే 160 ఆర్టులు గీశారు, ఆయన పేరు మీద ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి.