పునర్నవి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఇక ఆమె పెళ్లి చేసుకుంటోంది అని అందరూ భావించారు,ఇక అతనే ఆమె భర్త అని విషెస్ కూడా తెలిపారు, కాని ఒక్కసారిగా అందరిని బకరాలని చేసింది, అయితే ఆమె పెళ్లి ఎంగేజ్ మెంట్ ఏమీ కాదు ఇదంతా జస్ట్ ప్రమోషన్ కోసం చేసింది.
తను సరికొత్త పోస్టుతో ఇది పెళ్లికాదు వెబ్ సిరీస్ ప్రమోషన్ అని చెప్పింది.. వెబ్సిరీస్ ప్రమోషన్లో భాగంగానే టీజ్ చేసినట్లు చెప్పకనే చెప్పేశారు… పునర్నవి…. రఘునందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ కమిట్మెంటల్ దీనికి పవన్ దర్శకత్వం వహిస్తున్నారు, అయితే దీనికి ఎక్కడ లేని ఫేమ్ ప్రమోషన్ ఒక్క పోస్టుతో తీసుకువచ్చింది ఆమె.
ఈ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం పునర్నవి అభిమానులతో పంచుకున్నారు. త్వరలో ఈ సిరీస్ ఆహా వేదికగా అభిమానులను అలరించనుంది.. మొత్తానికి ఆమె అభిమానులు ఈ పోస్టుతో భలే బకరాలని చేశావు గా అని కామెంట్లు పెడుతున్నారు.