భయపెడుతున్న శ్వేతా వర్మ ది రోజ్ విల్లా సినిమా.. ఎలా ఉందంటే?

-

సినిమా పేరు పోస్టర్ చూడగానే అందరికీ అర్థమవుతుంది ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని. హేమంత్ ద‌ర్శ‌క‌త్వంలో అచ్యుత్ రామారావు పి, చిత్ర మందిర్ స్టూడియోస్ బేన‌ర్‌పై నిర్మించిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 1వ తేదీ) విడుదలైంది.తెలుగు కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ దక్కించుకుందనే విషయానికి వస్తే.

- Advertisement -

కథ:
క‌న్న‌డ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి న‌టించిన సినిమా నటించారు. కథ విషయానికి వస్తే యువజంట అయినటువంటి దీక్షిత్, శ్వేతా వర్మ కారులో ప్రయాణిస్తుండగా ఏదో సమస్య కారణంగా కారు ఆగిపోతుంది.న‌గ్జ‌ల్స్ వున్న డేంజ‌ర్ ప్రాంతంలో వారి కారు ఆగిపోవడంతో పోలీసులు వచ్చేవారిని సురక్షితమైన ఒక గ్రామంలో వదులుతారు. అక్కడ భోజనం చేస్తుండగా మిల‌ట్రీ రిటైర్ అయిన సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) త‌న భార్య హెలెన్‌తో (అర్చన కుమారి) తో ఉంటాడు.సోల్‌మాన్ పొర పోవడంతో అక్కడే ఉన్నటువంటి డాక్టర్ రవి చిన్న చిన్న చిట్కాలను చెప్పి అతని ఆరోగ్యం మెరుగు అయ్యేలా చేస్తాడు. ఈ క్రమంలోనే ఆ కృతజ్ఞతతో రవిరాజా వారిని వారి ఇంట్లో జరిగే ఆనివర్సరీ ఫంక్షన్ కి ఆహ్వానిస్తాడు.
అక్కడికి వెళ్ళిన ఈ జంటకు అక్కడ విచిత్ర వాతావరణ సంఘటనలు ఏర్పడతాయి. అక్కడ పరిస్థితులు వీరికి భయంగా ఆందోళనగా ఎందుకు కనిపిస్తాయి అసలు ఈ కథలో ఏం జరుగుతుందో అనేది అత్యంత ఆసక్తిగా మారింది.

విశ్లేషణ:
ఒక సాధారణమైన కథను భావోద్వేగంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతో త్రిల్లింగ్ గురిచేశారు దర్శకులు. ఎన్నో కీలక మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులకు ఉత్సాహాన్ని పెంచుతుంది.కొడుకు కోసం తల్లిదండ్రులు పడే ఆవేదన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఎక్క‌డా విసుగు తెప్పించ‌కుండా స‌స్పెన్స్‌ను చివ‌ర‌లో చెప్పి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు

సాంకేతికత:
ఇక సినిమాకి బొబ్బిలి సురేష్ సంగీతం హైలెట్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ అంజి సన్నివేశాలను వాస్తవికంగా తెరకెక్కించారు. శివ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది మరియు కొంచెం మెరుగ్గా ఉండవచ్చు. షార్ట్ రన్ టైమ్ ప్రాజెక్ట్‌కు హైలెట్ అయ్యాయి.. ఊహించని మలుపులతో ఎమోషనల్ సన్నివేశాలతో త్రిల్లింగ్ తెప్పించే ఘటనలతో ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.

రేటింగ్: 3/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ గెలుపుకి ప్రాంతీయ పార్టీలే కారణం: కేటీఆర్

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్...

KTR | ‘కాంగ్రెస్ ఓటమికి రేవంత్ తప్పుడు ప్రచారమే కారణం’

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).....