ఈ సోషల్ మీడియాలో కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ లో అలాగే కొన్ని వెబ్ మీడియాలో అనేక వార్తలు రెండు రోజులుగా వినిపిస్తున్నాయి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆస్పత్రి బిల్లుపై, అయితే తాజాగా దీనిపై ఆయన కుమారుడు అలాగే చెన్నైలో ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు క్లారిటీ ఇచ్చారు.
అసలు బాలు గారి విషయంలో ఆస్పత్రి బిల్లుల విషయంలో ఎక్కడా చర్చ జరగలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు బాలుగారి కుమారుడు చరణ్, అసలు నాన్నగారికి సంబంధించి ప్రతీ వారం ఆస్పత్రికి కొంత నగదు పే చేసుకుంటూ వచ్చాం.
చివరన నాన్నగారికి ఇలా జరిగిన తర్వాత .. అక్కడ ఉన్న వైద్యులు ఆస్పత్రి డైరెక్టర్ ముందు నాన్నగారిని తీసుకువెళ్లి జరగాల్సిన కార్యక్రమం చూడండి అని చెప్పారు,, ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు మా నాన్న భౌతికకాయం ముందు బిల్లుల కోసం ఒత్తిడి చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు.
ఇక ఆస్పత్రి బిల్లు తాము కొంత కట్టాము అని, మిగిలింది మాత్రం బీమా సంస్థ చెల్లించిందని చరణ్ వెల్లడించారు.