తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన నటుడు విశాల్ కు ఇటీవలే లాఠీ సినిమా చిత్రీకరణలోనూ గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి హీరో విశాల్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం తెలుస్తుంది. ఇవాళ ఉదయం మార్క్ ఆంటోనీ అనే సినిమా చిత్రీకరణలో ఫైట్ సీన్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరోకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.