ప్రభాస్ హీరోగా సలార్ చిత్రం తెరకెక్కుతోంది, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు… అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరు చేస్తారా అని చూస్తున్నారు అందరూ.. ఈ సినిమా గురించి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని చూస్తున్నారు అభిమానులు..
అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ ను తానేనని కన్నడ నటుడు మధూ గురుస్వామి స్పష్టం చేశారు… దీంతో క్లారిటీ వచ్చేసింది, ఇక ప్రభాస్ సినిమాలో నటించడం తనకు హ్యాపీగా ఉందని మధు గురుస్వామి తెలిపారు సోషల్ మీడియా వేదికగా.. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు, ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది వేగంగా ఫినిష్ చేస్తారు.. ఇక మరో రెండు చిత్రాలు కూడా చేస్తున్నారు ప్రభాస్.