సూపర్ కాప్ స్టోరీని ప్రభాస్ దగ్గరకు తీసుకువెళ్లిన యంగ్ డైరెక్టర్ ?

The young director who took the super cop story to Prabhas

0
120

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇంకా చాలా మంది దర్శకులు ఆయనకు కథలు వినిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన మరో సినిమాని ఒకే చేయబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. అది ఏమిటి అంటే? రన్ రాజా రన్ వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ సుజీత్ తో సాహో సినిమా చేశారు ప్రభాస్ . ఈ చిత్రంలో ఆయన్ని హాలీవుడ్ హీరోలా చూపించాడు. ఇక ఇప్పుడు తాజాగా ప్రభాస్ కి ఓ కథ వినిపించారట. ఇది సూపర్ కాప్ కథ అని తెలుస్తోంది. ఇక ప్రభాస్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే ఏడాది సెట్స్ పై పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలతో పాటు వైజయంతీ మూవీస్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ప్రభాస్ – సుజీత్ల ప్రాజెక్ట్ ఈ చిత్రాలు పూర్తి అయ్యాక ఉండనుంది అని టాలీవుడ్ టాక్.