బిగ్బాస్ రియాల్టీ షోకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే …దేశంలో పలుభాషల్లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక తెలుగు తమిళ్ లో కూడా సౌత్ ఇండియాలో మంచి ఫేమ్ తో దూసుకుపోతోంది, తెలుగులో అయితే బిగ్బాస్ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత ఏడాది నాల్గో సీజన్ లో మాత్రం మంచి ఫేమ్ వచ్చింది, ఆ ఇంటి సభ్యులు ఇప్పుడు సినిమాలతో బుల్లితెర షోలతో చాలా బిజీగా ఉన్నారు.. దాదాపు 105 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అందించారు. - Advertisement -
ఈ ఏడాది తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభం కానుంది. ఇక కంటెస్టెంట్లు ఎవరా అని అందరూ చూస్తున్నారు, ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నారట..తాజాగా వీరి పేర్లు వినిపిస్తున్నాయి కూకూ విత్ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్తో పాటు.. లక్ష్మీ రాయ్, పూనమ్ భజ్వా, కిరణ్, హేమ, సీనియర్ నటి రాధ, హీరో సిద్ధార్థ్. వీరితో చర్చలు జరిపారు అని వార్తలు వస్తున్నాయి.. అయితే ఎక్కడా ఎవరి పేరు రివీల్ అవదు..హౌస్ లోకి వెళ్లేవరకూ ఎవరిని ఫైనల్ చేశారు ఎవరిని తీసుకున్నారు అనేది బయటకు తెలియనివ్వరు అనేది తెలిసిందే, చూడాలి మరి ఎవరు ఒకే చెప్పారో.
|
|
|
బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 5 రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరేనట
-