ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇవే..

These are the films that were shot in Ukraine.

0
149

ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం యుక్రెయిన్‌ వైపే చూస్తుంది. యుక్రెయిన్‌ లో కొన్ని ప్రదేశాలలో రష్యా భీకరంగా దాడి చేస్తుంది. అయితే యుక్రెయిన్‌ కి సినిమా రంగానికి కూడా అవినాభావ సంబంధం ఉంది. యుక్రెయిన్‌ రాజధాని కైప్ తో పాటు మరి కొన్ని నగరాల్లో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని భారతీయ సినిమాలు అందులో మన తెలుగు సినిమాలు కూడా యుక్రెయిన్‌ లో షూటింగ్స్ ని జరుపుకున్నాయి. యుక్రెయిన్‌ లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’. ఈ సినిమాతో పాటు మరికొన్ని షూటింగ్ జరుపుకున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విన్న‌ర్:
సాయిధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంటగా 2017లో వ‌చ్చిన విన్న‌ర్ సినిమా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకుంది. అంతేకాదు అక్కడ షూటింగ్ కోసం వెళ్లిన మొద‌టి ఇండియ‌న్ చిత్ర‌మిదే. ఈ విషయాన్ని డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆర్‌ఆర్‌ఆర్‌:
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ‘నాటు నాటు’ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీక‌రించారు. గత ఆగస్టులో ఆర్‌ఆర్‌ఆర్‌ చివరి షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం ఉక్రెయిన్‌ వెళ్లింది.

రోబో 2.0:

సెన్సెషన్‌ డైరెక్టర్‌ శంకర్‌, సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘రోబో’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన రోబో 2.0లోని కొన్ని  సన్నివేశాలను ఉక్రెయిన్‌లోనే చిత్రీకరించారు. ఓ పాటను అక్కడే తీశారు.

దేవ్‌:

తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రజత రవి శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవ్‌’. రొమాంటిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌గా రూపొందించిన ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను 2018లో ఉక్రెయిన్‌లో తీశారు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.