బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఎంతోమంది సెలబ్రిటీలను 90 రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా బిగ్ బాస్ ఇంట్లో ఉంచి టాస్క్ లతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇక తాజాగా Biggboss-6 సీజన్ ఇవాళ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.
అయితే ఈ సీజన్ లో పాల్గొనే 20 మంది సెలబ్రెటీలు వీళ్ళే అంటూ సమాచారం అందుతుంది. తాజా సమాచారం ప్రకారం గీతు రాయల్, ఆదిరెడ్డి, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, ఆర్జె సూర్య, కమెడియన్ చంటి, నటుడు బాలాదిత్య, శాన్ని, సింగర్ రేవంత్, నటి సుదీప, యాంకర్ ఆరోహి రావు ఉండబోతున్నారు.
వీరితో పాటు సీరియల్ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయ సుల్తానా, లేడీ కమెడియన్ ఫైమా, నటి వసంతి, అర్జున్, రాజశేఖర్, రియల్ కపుల్ రోహిత్, మరీనాలు ఉన్నారు. దీనితోపాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.