మన తెలుగు చిత్ర సీమలో ఎలాంటి సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎంతో గొప్ప స్టేజ్ కు చేరుకున్నారు చిరంజీవి, ముఖ్యంగా తన నటన టాలెంట్ తో మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారికి బాగా దగ్గర అయ్యారు .. ఎందరికో ఆయన బాట చూపించారు. ఆయనని చూసి వందల మంది చిత్ర రంగంలోకి వచ్చారు. ఇక టాలీవుడ్ లో కమర్షియల్ హిట్లు అంటే చిరంజీవి అని చెప్పాలి.
బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవి అని చెప్పాలి.. రికార్డులు సరికొత్త ట్రెండ్ అంటే చిరు అనే చెప్పాలి.. చిత్ర సీమలో ఆయనకు వచ్చిన సినిమా కలెక్షన్లు మరెవరికి ఆ రోజుల్లో వచ్చేవి కావు.. ఎంత మంది యంగ్ హీరోలు నేటి తరం నటులు వస్తున్నా, టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అంటే మెగాస్టార్ అంటారు అందరూ.
చిరంజీవి కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి మరి వాటిలో కొన్ని చూద్దాం
సైరా నరసింహారెడ్డి 140 కోట్ల షేర్ సంపాదించింది
ఖైదీ నెంబర్ 150 ….రూ.92 కోట్ల వసూళ్లు వచ్చాయి
ఇంద్ర 27 కోట్ల షేర్ ను రాబట్టింది.
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ 26 కోట్ల షేర్ వచ్చింది
స్టాలిన్ 23 కోట్ల షేర్ ను రాబట్టింది.
శంకర్ దాదా జిందాబాద్ 18 కోట్ల షేర్ వచ్చింది
ఠాగూర్24 కోట్ల షేర్ వచ్చింది
జై చిరంజీవ 12కోట్ల షేర్ వచ్చింది
అన్నయ్య 13 కోట్ల షేర్ వచ్చింది
అంజి 12 కోట్ల షేర్ వచ్చింది