సంక్రాంతికి సందడి చేసే సినిమాలు ఇవే..!

These are the movies that make noise for wallpapers ..!

0
122

సంక్రాంతి అంటే బడా సినిమాలు క్యూ కడతాయి. కానీ ఈసారి పరిస్థితి వేరు. ఇప్పటికే సర్కారు వారి పాట, RRR, భీమ్లానాయక్ సినిమాలు వాయిదా పడగా ఇప్పుడు చిన్న సినిమాలు దీన్ని వాడుకోనున్నారు. సంక్రాంతే లక్ష్యంగా ఈ ఏడాది యువ హీరోల చిత్రాలు రేసులోకి వచ్చాయి. సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమా బంగార్రాజు మాత్రమే.

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘బంగార్రాజు’. తండ్రి నాగార్జునతో కలిసి ఇందులో నాగచైతన్య సందడి చేస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. సినిమా విడుదలపై చివరి వరకూ ఉత్కంఠ నెలకొనగా ఎట్టకేలకు జనవరి 14న ‘బంగార్రాజును’ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

చిరంజీవి అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమైంది. రియా చక్రవర్తి, రుచితా రామ్‌ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలిచింది. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశిదేవ్‌ విక్రమ్‌, కార్తిక్‌ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాలేజీ ప్రేమలు.. ఆ ప్రేమ కోసం విద్యార్థుల మధ్య జరిగే కొట్లాటలు తదితర అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘హీరో’ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది.