పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ లో ఆయనకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవర్ స్టార్ అంటే ఓ ప్రభంజనం.. ఆయన సినిమా వస్తోంది అంటే సరికొత్త రికార్డులే, అయితే ఆయన కెరియర్లో చాలా హిట్లు చూశారు, ఇక తాజాగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలు చేస్తున్నారు, వరుసగా ఐదు ప్రాజెక్టులు లైన్ లో పెట్టారు.. పవన్ కల్యాణ్ ఇంకా కధలు వింటున్నారు.
అయితే ఆయన కెరియర్లో రీమేక్ చేసిన చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం
అయ్యప్పనుమ్ కోషియమ్ సెట్స్ పై ఉంది
హింది సినిమా పింక్ దీనిని తెలుగులో వకీల్ సాబ్ గా తీసుకువస్తున్నారు.
తమిళంలో అజిత్ నటించిన వీరం సినిమా ఇక్కడ కాటమరాయుడిగా తీశారు
హిందీలో హిట్టైనా ఓ మై గాడ్ ఈ చిత్రాన్ని గోపాల గోపాలగా తీశారు
దబాంగ్ సినిమాని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీశారు
లవ్ ఆజ్ కల్ ఈ చిత్రాన్ని తెలుగులో తీన్ మార్ గా తీశారు
తిరుపాచి తమిళ చిత్రాన్ని తెలుగులో అన్నవరంగా తీశారు
తమిళ్ లో ఖుషీ సినిమాని తెలుగులో ఖుషీగా తీశారు
జో జీతా వహీ సికందర్ ఈ సినిమా తెలుగులో తమ్ముడుగా తీశారు
తమిళ్ లవ్ టుడే తెలుగులో సుస్వాగతంగా తీశారు
తమిళంలో గోకులతిల్ సీతై ఈసినిమాని గోకులంలో సీతగా తీశారు
ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిగా తీశారు
|
|
పవన్ కల్యాణ్ కెరియర్లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే
-