వివాహం విషయంలో కొందరు బయట సంబంధాలు చేసుకుంటే, మరికొందరు దగ్గర సంబంధాలు మేనమామ కూతుర్ని వివాహం చేసుకుంటారు, ఇలాంటి వారు చాలా మంది ఉంటారు, అయితే సినిమా పరిశ్రమలో పలువురు సెలబ్రిటీస్ కూడా ఇలా దగ్గర సంబంధాలు మరదలిని వివాహం చేసుకున్న వారు ఉన్నారు, మరి మన టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ ఇలాంటి హీరోలు ఎవరు అనేది చూస్తే.
హీరో..ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ బసవతారకంని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్ కి సొంత మరదలి వరుస అవుతుంది ఆమె. ఆయన 1942లో ఆమెను పెళ్లాడారు.
హీరో ఏ ఎన్ ఆర్ :
ఏ ఎన్ ఆర్ అన్నపూర్ణమ్మను 1949లో పెళ్లి చేసుకున్నారు, ఇక వివాహానికి ముందు ఆయన పది సినిమాల్లో నటించారు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరకు మరదలిని వివాహం చేసుకున్నారు ఏఎన్నార్ .
హీరో కృష్ణ :
సూపర్ స్టార్ కృష్ణ సైతం సొంత మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. 1961లో వీరి వివాహం జరిగింది. తర్వాత కృష్ణ నటి విజయ నిర్మలను కూడా వివాహం చేసుకున్నారు.
హీరో మోహన్ బాబు :
మోహన్ బాబు కూడా సొంత మరదలినే పెళ్లిచేసుకున్నారు. విద్యా దేవిని పెళ్లిచేసుకున్నారు కాని ఆమె మరణంతో, ఆమె సోదరిని నిర్మలా దేవిని వివాహం చేసుకున్నారు.
హీరో ఆది
సాయి కుమార్ నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది టాలీవుడ్ లో పలు సినిమాలు చేశారు, ..సొంత మరదలినే పెళ్లి చేసుకున్నారు.. సాయి కుమార్ భార్య తమ్నుడి కూతురిని ఆది పెళ్లి చేసుకున్నారు.
హీరో కార్తీ
తెలుగు వారికి బాగా సుపరిచితుడు హీరో కార్తీ సొంత మరదలు రజిని అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు, రజిని మంచి ఉన్నత చదువు చదువుకున్న అమ్మాయి.
హీరో శివ కార్తికేయన్
రెమో చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో శివ కార్తికేయ మరదలు ఆర్తిని పెళ్లి చేసుకున్నారు.
ఇలా మన టాలీవుడ్ కోలీవుడ్ లో చాలా మంది హీరోలు దగ్గర మరదల్ని వివాహం చేసుకున్నారు.