కరోనా ఏడాదిగా ఈ ఏడాది నిలిచిపోయింది.. దాదాపు మార్చి నెల చివరి నుంచి దారుణమైన పరిస్ధితి నెలకొంది అనే చెప్పాలి.అయితే ఈ సమయంలో చాలా మంది సినీ ప్రముఖుల వివాహాలు జరిగాయి, కొందరు సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య వివాహాలు చేసుకున్నారు.
మరి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఈ కరోనా సమయంలో వివాహం చేసుకున్న జంటలు ఎవరు అనేది ఓసారి చూద్దాం.
ఫిబ్రవరి 1 తమిళ, తెలుగు నటుడు మహత్ రాఘవేంద్ర  ప్రాచీ మిశ్రా వివాహం చేసుకున్నారు
ఫిబ్రవరి 5 ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు మంజు భార్గవిని వివాహం చేసుకున్నారు
ఏప్రిల్ 17వ తేదీ  మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, నిఖిల్ గౌడ  రేవతిని వివాహం చేసుకున్నారు
మే 10 నిర్మాత దిల్ రాజు తేజస్వినిని వివాహం చేసుకున్నారు
మే 14 హీరో  నిఖిల్ సిద్ధార్థ్  డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నారు
మే 14న యువ నటుడు, జబర్దస్త్ ఫేమ్ మహేశ్ వివాహం పావనిని వివాహం చేసుకున్నారు
జులై 26న  హీరో నితిన్, షాలినీ వివాహం జరిగింది.
ఆగస్ట్ 2న  దర్శకుడు సుజిత్ రెడ్డి  ప్రవల్లిక వివాహం జరిగింది
ఆగస్ట్ 8న ప్రముఖ నటుడు రానా వివాహం  మిహికా బజాజ్ తో జరిగింది
అక్టోబర్ 30వ కాజల్ వివాహం చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూతో జరిగింది
అక్టోబర్ 31  ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల కుమారుడు రాజా వివాహం లక్ష్మీ హిమబిందుతో  జరిగింది.
నవంబర్ 4న నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ రెడ్డి వివాహం శ్రీలిఖితతో జరిగింది
డిసెంబర్ 9వ తేదీ నటి నిహారిక వివాహం  జొన్నలగడ్డ చైతన్యతో ఘనంగా జరిగింది. 


 
                                    