బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మరింత పాపులర్ షో అయింది. ఇక వచ్చే నెల నుంచి సీజన్ 5 షురు కానుంది. కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయిందట. ఈసారి హౌస్ లోకి ఎవరు రాబోతున్నారు అని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈసారి సోషల్ మీడియా స్టార్లు అలాగే బుల్లితెర నటులని హౌస్ లోకి తీసుకురానున్నారట.
అయితే తాజాగా చాలా మంది పేర్లు వైరల్ అయ్యాయి. కాని ఇందులో ఎవరు వస్తారు అనేది తొలి రోజు షో చూసే వరకూ తెలియదు. అంతా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు నిర్వాహకులు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మగువల హవానే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
ఈసారి హౌస్ లోకి పది మంది మగువలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక సింగ్,
యాంకర్ వర్షిణి
ఆర్జే కాజల్
ప్రియ
మంగ్లీ
టీవీ 9 యాంకర్ ప్రత్యూష.
నవ్యస్వామి మరి చూడాలి వీరిలో ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారో.