నన్ను చంపాలని చూస్తున్నారు..నటి కరాటే కళ్యాణి ఆరోపణ..పోలీసులకు ఫిర్యాదు

0
106

కరాటే కళ్యాణి పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. కిక్ సినిమాలో బాబీ అంటూ కళ్యాణి ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే.

ఆ తరవాత అనేక చిత్రాల్లో నటించి అలరించింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్-5 సీజన్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అందులోను ఆమె బయట ఎలా ఉందో హౌస్ లోను అలానే ఉంది. కానీ ఎక్కువ కాలం బిగ్ బాస్ లో కొనసాగలేదు. ప్రస్తుతం కళ్యాణి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటోంది. బీజేపీలో ఉన్న కళ్యాణి పొలిటికల్ డిబేట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే తాజాగా కళ్యాణి తనకు ప్రాణ హాని ఉందంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఒక హత్య కేసులో సాక్ష్యాలు తారు మారు చేసి ఓ స్వచ్ఛంద సంస్థ సాక్ష్యాలను తారు మారు చేసిందని ఆమె ఆరోపణలు చేసింది. దాన్ని బయటపెడుతున్న కారణంగా తనను కక్ష కట్టి చంపేయాలని చూస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.