ఎఫ్3 హ్యాట్రిక్‌ విజయానికి వీరే కారణం..నిర్మాత దిల్‌ రాజు

0
105

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ సినిమాలో హీరోల సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా..దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎఫ్ 2 పోయిన 2019 సంక్రాంతికి విడుదలైన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్3 ని అనిల్ రావిపూడి తెరెకెక్కించి భారీ అంచనాలతో మే 27వ తేదీన విడుదలై ధీయేటర్లలో సందడి చేసింది. అయితే ఈ సందర్భంగా ఈ సినిమా విజయోత్సవాన్ని హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించి చిత్రబృందం సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుండడంతో చిత్రబృందం ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు.

ఈ సందర్భంగా హీరో వెంకటేష్‌ మాట్లాడుతూ..ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురావాలనే లక్ష్యంతో చేసినట్టుగానే అందరు వచ్చి ఈ సినిమాను చూస్తూ ఆనందిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లతో మా సంస్థకు హ్యాట్రిక్‌ విజయం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత దిల్‌ రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూస్తూ కడుపుబ్బా నవ్వుతూ ఎంజాయ్ చేయాలనీ చిత్రబృందం కోరింది.