నర్సింగ్ యాదవ్ తెలుగు చలనచిత్ర సీమలో కమెడియన్ విలన్ రోల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు..తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించారు ఆయన.
నర్సింగ్ యాదవ్ హైదరాబాదులో రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు. హైదరాబాదులోని న్యూ సైన్సు కళాశాలలో ఇంటర్మీడియట్ వరకూ చదివారు. ఆయన భార్య చిత్ర యాదవ్. కుమారుడు రుత్విక్. ఇక ఆయన చిత్ర సీమలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అంటే.
నర్సింగ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు అనే చిత్రం. నటుడిగా అతనికి బ్రేక్ ఇచ్చింది దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆయన నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. తర్వాత చిరంజీవి తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు, ఇలా అనేక చిత్రాలు చేశారు ఆయన.
ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడతారు, కామెడీ విలనిజం చూపిస్తారు అందుకే ఆయనని అన్నీ చిత్రాల్లో దర్శకులు తీసుకునేవారు, ఇక వర్మ సినిమాలో ఆయన తప్పకుండా ఉండేవారు.. నర్సింగ్ కు
నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు. ఆయన అన్న పొలిటీషియన్. కార్పొరేటర్ గా పనిచేసాడు. ఇతడి తమ్ముడు వ్యాపారస్తుడుగా ఉన్నారు.ఇక సినిమాల్లో బిజీగా ఉన్న ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు, ఆయన భార్య చిత్ర ఓ పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వీరు ప్రేమ పెళ్లి తిరుపతిలో చేసుకున్నారు.