మూడో పెళ్లికి సిద్ద‌మైన హీరోయిన్ ఎవ‌రంటే

మూడో పెళ్లికి సిద్ద‌మైన హీరోయిన్ ఎవ‌రంటే

0
101

నటి వనితా విజయకుమార్ అంద‌రికి తెలిసిన న‌టి ఆమె ఇప్ప‌టికే రెండు వివాహాలు చేసుకున్నారు, తాజాగా ఆమె మూడోసారి వివాహం చేసుకుంటున్నార‌ట‌,విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది వ‌నిత‌.

2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఇక త‌ర్వాత ఎవ‌రి లైఫ్ వారిది అలాగే ఉన్నారు…2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత ఆనంద్‌తోనూ విడాకులు తీసుకుంది.

తాజాగా ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని ఈ నెల 27న వివాహాం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే వనిత తమిళ బిగ్‌బాస్ 3లో పాల్గొని బాగా పాపులర్ అయింది. ఇక ఈ వివాహం గురించి వ‌నిత కుటుంబం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.