తిరుమల కాదు షిరిడి వెళ్లిన మహేష్ రీజన్ ఏంటి

తిరుమల కాదు షిరిడి వెళ్లిన మహేష్ రీజన్ ఏంటి

0
85

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రానుంది, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్.. అయితే ఈ గ్యాప్ లో మహేష్ బాబు తన కుటుంబంతో సరిలేరు నీకెవ్వరు విజయవంతం కావాలని కోరుకుంటూ షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతోంది. అందుకే షిరిడీ సాయి ఆశీస్సుల కోసం మహేశ్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసి షిరిడీ వచ్చారు. ఆయన షిరిడీ రావడంతో అక్కడ ఉన్న కొందరు అభిమానులు ఆయనని చూసి కాసేపు ముచ్చటించారు.

సాయినాధుని ఆశీస్సులు తీసుకున్నారు ప్రిన్స్… అలాగే మహేష్ కుటుంబానికి షిరిడీ సంస్థాన్ సభ్యులు స్వాగతం పలికారు. సాధారణంగా మహేశ్ బాబు తన చిత్రం విడుదలకు ముందు తిరుమల వెళుతుంటారు. ఈసారి అందుకు భిన్నంగా షిరిడీ వెళ్లి సాయిబాబా ఆశీస్సులు అందుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు మహేశ్ బాబుకు జ్ఞాపికను బహూకరించాయి. ఇక సినిమా విడుదల తర్వాత ఆయన నెల రోజులు ఫారెన్ ట్రిప్ వెళతారు అని తెలుస్తోంది తర్వాత కొత్త చిత్రం ట్రాక్ పై పెడతారట.