సోనూసూద్‌కు ఇలా స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న ఎలా వ‌చ్చిందంటే

This is how the idea of ​​helping Sonu Sood came about

0
286

గ‌త ఏడాది నుంచి క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు ఎంతో సాయం చేశారు సోనూసూద్. ఆయ‌న రీల్ లైఫ్ లో విల‌న్ అవ్వ‌చ్చు, కాని రియ‌ల్ లైఫ్ లో ఎంత పెద్ద హీరోనో ప్ర‌జ‌ల‌కు అర్దం అయింది. ఆయ‌న చేసిన సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి. ఎవ‌రు సాయం కోరి వ‌చ్చినా వారికి కాదు అన‌కుండా సాయం చేశారు. గ‌త ఏడాది లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంతో మందిని బ‌స్సులు, రైళ్లు, విమానాల ద్వారా త‌మ సొంత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వ‌ల‌స కూలీల‌కు ఆయ‌న చేసిన సాయం అంతా ఇంతా కాదు.

అయితే సోనూసూద్‌కు ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయాల‌నే ఆలోచ‌న ఎప్పుడు మొద‌లైంది.
సోనూ సూద్ భార్య ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సోనూ భార్య సోనాలీ ఏమ‌న్నారో చూద్దాం.

గ‌త ఏడాది క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఇంట్లో అంద‌రూ కూర్చుని టీవీ చూస్తున్నాం. ఈ స‌మ‌యంలో వేల మంది ఇబ్బంది ప‌డ‌టం చూశాం. వ‌ల‌స కూలీల బాధ‌లు చూసి చ‌లించిపోయారు సోనూసూద్.
వారిలో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆ రోజంతా మేము ఆ దృశ్యాల గురించే మాట్లాడుకున్నాం.` ఇక త‌ర్వాత వారి కోసం ఏమైనా చేయాలి అని ఆలోచ‌న‌తో ఇలా సాయం చేశాం అని తెలిపారు సోనాలీ.