సిరివెన్నెల పాటల ప్రస్థానం మొదలైంది ఇలా..

This is how the reign of Sirivennela songs began ..

0
103

వెండితెర సిరివెన్నెల కరిగిపోయింది. పాటకు వెన్నెల వెలుగు పోయింది. కెరీర్​లో దాదాపు మూడు వేలకుపైగా పాటలను రచించిన ఈ మాంత్రికుడికి 11 రాష్ట్ర నంది అవార్డులు, నాలుగు ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు వరించాయి. 2019లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి 1955 మే 20న అనకాపల్లిలో జన్మించారు. సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. సీ.వి యోగి, సుబ్బలక్ష్మి దంపుతుల కుమారుడు సిరివెన్నెల. ఆయన పదవ తరగతి వరకు అనకాపల్లిలో జన్మించి..కాకినాడలో ఇంటర్, బీఏ పూర్తిచేశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్‏లో ఎంఏ పూర్తి చేశారు.

ఎంఏ చదువుతూండగానే 1985లో దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన “సిరివెన్నెల” సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరుతోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా సినీ రంగంలో స్థిరపడిపోయి 3000 పైగా పాటలు రచించారు. విధాత తలపున ప్రభవించినది…అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు చిరస్థానం సంపాదించి పెట్టింది. ఆరంగేట్రం సిరివెన్నెలలోని ప్రతి పాట అణిముత్యమే.

ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు.. త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి  సిరివెన్నెల పని చేశారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి గారు చివ‌ర‌గా నాని హీరోగా న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో రెండు పాట‌లు రాయ‌డం జ‌రిగింది. అవే ఆయన
చివ‌రి పాట‌లు కావ‌డం విషాద‌క‌రం.