మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ ఇదే..

0
86

ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తన నటనతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోయిన్ ల నుండి ముద్దుగుమ్మల వరకు అందరితో నటించిన ఈ హీరో తాజాగా ఆచార్య మూవీలో నటించి విశేషప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల అయ్యి కలెక్షన్ ల సునామి సృష్టించింది.

అయితే చిరంజీవి నెక్స్ట్ ఏ సినిమా తీస్తాడని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. అయితే  ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమాపై  డైరెక్టర్ మోహన్ రాజా ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’ వస్తుందని చెప్పాడు.

షూటింగ్ కూడా దాదాపు పూర్తయిపోయినట్టు కేవలం డబ్బింగ్ పార్ట్ కొంత మిగిలి ఉందని తెలిపారు. అనంతరం ప్రొడ్యూసర్ ఎన్ వీ మాట్లాడుతూ ‘ఆచార్య’ తర్వాత రాబోయేది ‘గాడ్ ఫాదర్’ సినిమానేనని పక్కా క్లారిటీ ఇచ్చారు. గాడ్ ఫాదర్’ పిక్చర్ ను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా కూడా ఆచార్యలాగా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.