అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నివేతా థామస్ ఎంట్రీ..ఫుల్ జోష్ లో ఫాన్స్

0
112

శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న న్యాచురల్ స్టార్ నాని తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా క్రమంలో ఈ యంగ్ హీరో తాజాగా అంటే సుంద‌రానికీ ఒకే చెప్పి మళ్ళి ఫ్యాన్స్ ను ఖుషి చేసాడు. వేక్ ఆత్రేయా ద‌ర్శ‌క‌త్వంలో తెరెకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా న‌జ్రియా హీరోయిన్‌గా నటించింది.

ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ట్రైల‌ర్, టీజ‌ర్‌కు , పాటలకు రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం సినిమా కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగగా ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అంతేకాకుండా ఈవెంట్ కు నివేదా థామస్ వచ్చి కూడా వచ్చి అంటే సుంద‌రానికీ చిత్ర సభ్యుల గురించి మాట్లాడింది. ‘ఇంతమందిని చూసి చాలా రోజులైంది. బ్రోచేవారెవరు టీం మొత్తం ఇక్కడే ఉండడం వల్ల ఈ ఫంక్షన్ నా సినిమాలాగా ఉంది అని పేర్కొంది. థియేటర్లలో ఈ సినిమాను అందరు చూసి ఎంజాయ్ చేయాలనీ తెలిపింది.